ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కూడా జగన్‌తో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవల సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ, అలాగే, పృథ్వీరాజ్ జగన్ పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబుకు మంత్రి అయ్యన్న పాత్రుడు బిగ్ షాక్.
అయితే, తాజాగా ఆ జాబితాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా చేరిపోయారు. అయితే, సూపర్ స్టార్ కృష్ణ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లో చాలా సందర్భాల్లో ప్రజా సమస్యలపై చర్చించామన్నారు. ఒక మనిషిని ప్రేమగా చూడటం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వైఎస్ఆర్‌కే సాధ్యమన్నారు.
ముగ్గురికి తలో లక్ష యాబై వేల రూపాయలిచ్చిన పోసాని కృష్ణమురళి ..!
ఇదే సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ జగన్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలానే.. నేడు వైఎస్ జగన్ కూడా చేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి సమస్యలను జగన్ నిశితంగా వింటున్నారన్నారు. రోళ్లు సైతం పగిలే ఎండల్లోనూ వైఎస్ జగన్ ప్రజల కోసం పాదయాత్ర చేయడం గొప్ప విషయమన్నారు.