లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించింది.
అయితే మే 29న స్పీకర్‌ను విడివిడిగా కలిసిన వైసీపీ ఎంపీలను తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. అయితే ప్రత్యేక హోదాపై భావోద్వేగ పరిస్థితుల కారణంగా రాజీనామా చేస్తున్నట్టు భావిస్తున్నానని స్పీకర్ వారితో అన్నారు. మరోసారి ఆలోచించుకోమని చెప్పి పంపించారు. అయితే ఈసారి రాజీనామాలు ఆమోదించాల్సిందే అని ఎంపీలు పట్టుబడితే ఆమోదించక తప్పదని 29వ తేదీన ప్రకటించారు. దాంతో ఇవాళ వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
see also:వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!