తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దామోదర్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం మరియు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
