ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి చేస్తే వైసీపీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు వైసీపీ సీనియర్ నేత ,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళా రామకృష్ణ రెడ్డి .
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలు రాజీనామా చేయడం చాలా చిన్న విషయం కానీ ఆ రాజీనామాలను స్పీకర్ చేత ఆమోదింపచేస్కోవడం చాలా గొప్పదని ఆయన అన్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తన ఎన్నికల కౌటింగ్ లో టీడీపీ నేతలు చాలా దారుణాలకు పాల్పడ్డారు .
అందులో భాగంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయించారు.అయిన కానీ ప్రజల మద్దతు ఉన్న తనే గెలుపొందాను అని ఆయన పేర్కొన్నారు .అయితే ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు ,కౌటింగ్ ఏజెంట్ల పాత్ర అమోఘమని ఆయన అభిప్రాయ పడ్డారు.ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంటె వైసీపీ గెలవడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు ..