రానున్న ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేయ్యలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే ఒక వైపు నేతలందరు కాంగ్రెస్ పార్టీ నుండి చేజారిపోతున్నారు.దీంతో ఏమిచేయాలో తోచక పార్టీ అధిష్టానం ఉండగా..ఇప్పుడు తాజాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిర్వహించిన ఓ ముఖ్య సమావేశంలో ఓ సీనియర్ నేత సంచలన ప్రకటన చేశారు.
రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే వారికి టికెట్లు ఇవ్వమని అయన స్పష్టం చేశారు.ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతలు తల పట్టుకుంటున్నారు.ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఆశిస్తున్న క్రమంలో ఆ పార్టీ నేత కూన శ్రీశైలం గౌడ్ కు దిమ్మ తిరిగేలా అయింది అని పలువురు చర్చించుకుంటున్నారు.ఇప్పటికే అయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పాదయత్ర చేపట్టారు.పాదయాత్ర చేపట్టిన మొదటి రోజే ఆయనకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది.దీంతో ఆయనకు రానున్న ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.
అయితే ఒక వైపు ప్రస్తుత స్థానిక యువ ఎమ్మెల్యే కె.పి వివేకానంద నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళగలుగుతున్నారు.ఇప్పటికే అయన ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.నిత్యం ప్రజా సమస్యలపట్ల ఎప్పటికప్పుడు స్పందించడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద పై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.దీంతో రానున్న ఎన్నికల్లో వివేకానంద తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.