ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు,ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
గతంలో రాష్ట్రంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఒక పదిరోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెల్సిందే.తాజాగా సీఎం రమేష్ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .
అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేవరకు గడ్డం తీయను అని ..ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలో ఏర్పాటు చేసేవరకు గడ్డం తీయను అని శ్రీవారికి మొక్కుకున్నాను అని ఆయన మీడియాకు తెలిపారు .