ఏపీలో చంద్రబాబు సర్కార్ గడువు ముస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు కూడా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ బలమెంత..? ఏ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? తమ అనుచరవర్గం ఎలా ఉంది..? 2019లో ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టనున్నారు..? అన్న ప్రశ్నలపై రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. సర్వేకు అనుగుణంగా పార్టీ మారాలన్నదే వారి ఉద్దేశం కాబోలు.
ఇదిలా ఉండగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు ఎవ్వరినీ వదలకుండా దాడులకు పాల్పడ్డ ఘటనలు కోకొల్లలు. అంతేకాకుండా, చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీల ఆగడాలు అంతా ఇంతా కాదు.! వృద్ధుల, దివ్యాంగులు, వితంతు పింఛన్‌ల నుంచి ఇసుక దోపిడీ వరకు వారి చేయని ఆకృత్యాలు లేవని చెప్పలేం అంటూ ఇటీవల పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఆఖరకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం జన్మభూమి కమిటీలను ఇప్పటికైనా రద్దు చేయండి సార్.. లేకుంటే ఆ కమిటీలే టీడీపీ ఓటమికి ప్రధాన కారణమవుతాయి అంటూ మీడియా ముఖంగా సలహా కూడా ఇచ్చారు.
సొంత పార్టీ నేతలే జన్మభూమి కమిటీల అన్యాయాలు, ఆగడాల గురించి చెప్తుండటంతో మేల్కొన్న చంద్రబాబు చేసేది లేక ఆ కమిటీలను రద్దు చేశారు. కేవలం జన్మభూమి కమిటీలతోనే టీడీపీ దోపిడీ ఆగలేదని, విజయవాడలో కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ వంటి మహిళలను వేధించే సంఘటనలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో, రాజధాని అమరావతి నిర్మాణంలో టీడీపీ నేతలు లక్షల కోట్ల ధనాన్ని దోచుకున్నారన్న విమర్శలు దావానంలా వ్యాపించాయి. అయితే, ఆ విమర్శల్లో కొన్ని ఆధారాలతో సహా బయటపడగా, మరికొన్ని బయటపడాల్సి ఉన్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
పై విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇటీవల ఏపీ వ్యాప్తంగా జల్లెడపట్టి మరీ సర్వే నిర్వహించాయి. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగగా..చంద్రబాబు సర్కార్ కుంభకోణాలు, మహిళలపై దాడులు, జన్మభూమి కమిటీల దోపిడీ ఇలా టీడీపీ వైఫల్యాలే వైసీపీ గెలుపుకు నాంది పలకనున్నాయని సర్వే సంస్థలు తేల్చాయి. రిపబ్లికన్ టీవీ, అమెరికన్ సర్వే సంస్థ, ఆర్ఎస్ఎస్ సర్వ, రాహుల్ గాంధీ సర్వే, నేషనల్ ఛానెల్స్ సర్వేలు, ఏపీ ఆక్టోపస్ లగడపాటి సర్వే కూడా 2019లో వైసీపీనే అధికారం చేపట్టనుందని తేల్చింది.
సర్వే సంస్థల ఫలితాలను పరిగణలోకి తీసుకున్న పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, నాయకులు ఇటీవల వైసీపీలోకి క్యూకడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ నేతలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కొండ్రు మురళీ వైసీపీలోకి చేరబోతున్నారని, అందుకు తేదీని కూడా ఖరారు చేసుకున్నారని పచ్చబ్యాచ్‌కు చెందిన ఓ మీడియా ఛానెల్ ఇవాళ ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేతలతో కిల్లి కృపారాణి, కొండ్రు మురళీ చర్చలు జరిపారని, పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.