Home / MOVIES / ఐదారుగురు పిల్ల‌లు ఉన్న‌వాడివి.. నీకు రాజ‌కీయాలు అవ‌స‌రమా..?

ఐదారుగురు పిల్ల‌లు ఉన్న‌వాడివి.. నీకు రాజ‌కీయాలు అవ‌స‌రమా..?

ప‌వ‌న్ క‌ళ్యాన్‌, ఇప్ప‌టికైనా తెలుసుకో, సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. సినిమాల్లో ఒక్క డైలాగ్‌ను 20, 30 సార్లు చెప్పే నీవు.. రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తావు..?. నీ అదృష్టం బావుండి ఏదో ఒక సినిమా హిట్ అయింది. ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్‌ను ఉప‌యోగించుకుని..ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తావా..? అలా సీఎం కుర్చీ కోసం ఆశ‌ప‌డి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీ అన్న మెగాస్టార్ చిరంజీవి ప‌రిస్థితి ఏమైందో గుర్తు లేదా..? రేప‌టి రోజున నీ ప‌రిస్థితి కూడా అంతే..! అంటూ టాలీవుడ్ వైర‌ల్ న‌టిగా పేరొందిన శ్రీ‌రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాన్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే వారికి ఒక‌రు లేదా ఇద్ద‌రు సంతానం ఉండాల‌నుకుంటా.. అటువంటిది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏకంగా ఐదారుగురు సంతానం ఉన్నారు. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేయ‌డానికి అన‌ర్హుడు. అది తెలీక జ‌న‌సేన పేరుతో రాజ‌కీయ పార్టీ పెట్టి అనంత‌పురంలో పోటీ చేస్తాను..శ్రీ‌కాకుళంలో పోటీ చేస్తా అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat