తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని పార్టీల చూపు టీఆర్ఎస్ వైపేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో సీపీఐ పార్టీకి చెందిన సుమారు 500మంది కార్యకర్తలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమనే టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 4 ఏళ్లకు ముందు 4 ఏళ్ల తర్వాత అభివృద్దిని ప్రతీ ఒక్కరు గమనించాలని ఆయన కోరారు. పార్టీలొ కొత్త పాత అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు కలిసి కట్టుగా పని చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.
ఏ సమస్య వచ్చినా పరిష్కరించాడానికి అరూరి రమేష్ సిద్దంగా ఉంటాడని వారికి హామీ ఇచ్చారు. మన ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ది, పార్టీ బలోపేతానికి అందరం కలిసి కట్టుగా ఒక కుటుంబ సభ్యులుగా పని చేయాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. సీఎం కేసీఆర్ గారు ప్రవేశ పేట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.పాల్గొన్నవారిలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ శ్రీమతి లలితా యాదవ్,కార్పొరేటర్ బిక్షపతి,డివిజన్ అధ్యక్షులు రాజు, పైడిపల్లి గ్రామపార్టీ అధ్యక్షులు హరికృష్ణ,బుద్ధే వెంకన్న,కుమార్ యాదవ్,సల్దాన్,ల్యాదల్లా రమేష్,కొత్తకొండ సమ్మయ్య,నాగరాజు,మరియు తదితరులు..