ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణం అని అన్నారు.హైదరాబాద్ నగరానికి ఐకియా లాంటి మరిన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు రాబోతున్నాయని అన్నారు.పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రము అనువైన ప్రాంతమని.. తెలంగాణ.. విదేశీ పెట్టుబడులకు అడ్డాగా మారిందన్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే హ్యాండ్లూమ్స్ తో పాటు ఇతర ప్రొడక్ట్స్ కూడా ఐకియాలో అమ్ముతారని చెప్పారు. అన్ని వస్తువులను అందుబాటు ధరల్లోనే ఐకియా ఉంచిందని… స్టోర్ లో 30శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారని కేటీఆర్ అన్నారు.
ఐకియా ప్రత్యేకతలు..
మొత్తం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో 13 ఎకరాల్లో ఫర్నీచర్ షోరూమ్
మొత్తం 7వేల 500 ప్రొడక్ట్స్ ను అందుబాటులో ఉన్నాయి.
వెయ్యి సీట్లతో అతిపెద్ద రెస్టారెంట్ ఐకియా స్టోర్ లో ఉంది.
ఆహ్లాదకరంగా.. పిల్లలు ఆడుకునే ప్లే జోన్ కూడా ఉంది.
మొత్తం 950 ప్రత్యక్ష ఉద్యోగులు మరో 1500 పరోక్ష ఉద్యోగులు ఈ స్టోర్‌లో పనిచేస్తున్నారు.
Welcome another marquee brand entering India through our own Hyderabad & Telangana ?
Along with Klas Molin, Ambassador, @swedeninIndia, Jesper Brodin, CEO, IKEA Group and Peter Betzel, CEO, IKEA India formally inaugurated IKEA store in Hyderabad today pic.twitter.com/Ea46oE70Ea
— KTR (@KTRTRS) August 9, 2018