ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీపై ట్రాన్స్ జండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా రాష్ట్రంలోని విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు . తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇటీవల పార్లమెంటు ఎదురుగా హిజ్రా వేషధారణలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగిన సంగతి తెల్సిందే .ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమన్నా పేర్కొన్నారు
