అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో ఉండడం వల్ల ఈసారి రాఖీ పండుగకు తన చెల్లెలు షర్మిలను మిస్ అవుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.
“మిస్సింగ్ యూ ఆన్ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్ ఆల్వేస్” అంటూ ఆప్యాయంగా ట్వీట్ చేసారు జగన్.. మరోవైపు విశాఖజిల్లా ధారభోగాపురం వద్ద జగన్ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆపార్టీ మహిళావిభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు పలువురు మహిళలు జగన్ కు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ జగన్ కు రాఖీ కట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళా జగన్ సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటోందన్నారు రోజ. అలాగే పాదయాత్ర మొత్తం జగన్ మహిళలు రాఖీలతో స్వాగతం పలుకుతున్నారు. జగన్ కు రాఖీ కట్టి అన్నా చెల్లెల్ల అనుంబంధం ఉందని చాటి చెప్తున్నారు.