తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు హర్షిత్ కి మరో నాలుగు రోజుల్లో వివాహంజరగనుంది. రాజ్ తరుణ్ మూవీ ‘లవర్’ ద్వారా హర్షిత్ రెడ్డి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దిల్ రాజ్ వారసత్వంతో వారి కుటుంబం నుంచి వచ్చిన తొలి యువ నిర్మాత హర్షిత్ రెడ్డి. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో పాటు మనికొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ హర్షిత్ రెడ్డి సినీ నిర్మాణంలో మెళకువలు నేర్చకుంటున్నాడు. హర్షిత్ రెడ్డి ఎంగేట్మెంట్ కొన్ని రోజుల క్రితం గౌతమితో జరిగింది. గౌతమి మరెవరో కాదు. కర్నూల్ జిల్లా ఆదోని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె. ఇటీవల హర్షిత్ కి నిశ్చితార్ధం జరిగింది. గోవా వెడ్డింగ్ టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హర్షిత్ రెడ్డి, గౌతమి వివాహం గోవాలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు గోవాలో వివాహం జరగనుంది. ఈ పెళ్లికి టాలీవుడ్ కి చెందిన కొంతమంది దర్శకనిర్మాతలతో పాటు హీరోలకి కూడా ఆహ్వానం అందిందని తెలుస్తోంది. 23న హైదరాబాద్ లో ఓ కన్వెన్షన్ సెంటర్ లో వివాహ విందు ఏర్పాటు చేయబోతుంది దిల్ రాజు ఫ్యామిలీ. ఈ వేడుకలో మాత్రం టాలీవుడ్ కి చెందిన దాదాపు అందరూ సెలబ్రిటీలు కనిపించనున్నారు.