సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు వర్తించనుంది. గాజు గ్లాసు గుర్తు సులువుగానే ప్రజల్లోకి వెళ్తుంది.
అయితే, ఈ గుర్తుపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు దక్కిన గుర్తు సామాన్యుడి తాగే టీ గ్లాస్ ని పోలి ఉందని, ఇది సామాన్యుడి గుర్తు అంటూ జనసేన హర్షం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆ పార్టీ గుర్తుపై నటి శ్రీరెడ్డి చేసిన ఘాటు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీని, పవన్ సోదరుడు నాగేంద్ర బాబును విమర్శిస్తూ ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ”అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా..? వైన్ గ్లాసా..? స్కాచ్ గ్లాసా..? అని వ్యంగ్యంగా రాసింది. అంతటితో ఆగకుండా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా.. అసలే రీసెంట్ గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో.. అర్ధం కావట్లేదు” అంటూ రాసుకొచ్చింది. కాగా, శ్రీరెడ్డి చేసిన పోస్టుపై పవన్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. జనాలకు ఈ గాజు గ్లాసులో టీ కనిపిస్తుంటే.. శ్రీరెడ్డికి మాత్రం మద్యం కనిపిస్తుందంటూ విరుచుకుపడుతున్నారు.