2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తనని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తానని బరోసా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ మాటలు నమ్మిన ప్రజలు అతనికే ఓట్లు వేసి గెలిపించారు.అయితే ఈ రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు.చంద్రబాబు గద్దెనెక్కే నాటికి ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి.వివిధ రకాల కోతలు, షరతులతో ఉన్నాయంటూ చివరకు రుణాలను రూ.24,500 కోట్లకు మన సర్కారు కుదించేసింది.కాని ఇప్పటి వరకు మూడు విడతలకు గాను రూ. 14,497 కోట్లు మాత్రమే చెల్లించారు.ఈ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నాయి.
రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో 35 లక్షల మంది రైతుల ఖాతాలు డిఫాల్టర్లుగా మారాయి.వారికి కొత్త రుణాలు ఇచ్చేదే లేదని బ్యాంకులు తేల్చిచెబుతున్నాయి.దీనితో రుణాలు చెల్లించని రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి.అంతేకాక అప్పులు కడతారా? లేక అరెస్టులు చేయించి కోర్టులకు ఈడ్చమంటారా? అంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు రైతుల పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు.వడ్డీలు అమాంతం పెరగడంతో వాటిని తీర్చే దారి కనిపించక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.రైతుల ఆత్మహత్యలకు కారణమైన బాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.