1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రోళ్లను తిట్టాడని ఇప్పుడు కొత్తగా అడుగుతున్న చంద్రబాబు అండ్‌కో మరి 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలీదా..?(ఈ ఐదేళ్లు తెలంగాణలో ఆంధ్ర ప్రజలను మంచిగా చూసుకోలేదా..)
2.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేసీఆర్‌ను అడిగితే ఒప్పుకోలేదని, అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నానని కాంగ్రెస్ నాయకుల ముందే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పలేదా..?
3.హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్‌తో మనం పొత్తు పెట్టుకుందాం అని, అలా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని అడిగినా కేటీఆర్ ఒప్పుకోలేదు అని చంద్రబాబు అని మీడియా సాక్షిగా చంద్రబాబు చెప్పలేదా..?
4.పోలవరాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖ రాసిన కోదండరాం పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటావు చంద్రబాబూ..?
5. అసలు హోదా వద్దు.. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి. హోదా వలన లాభాలేంటి.. హోదా అంటే జైల్లో వేస్తా.. నేను 40 ఇయర్స్.. అంతా నాకు తెలుసు..ఈ జగన్‌కు ఏమీ తెలీదు అని అసెంబ్లీలో హేళనగా మాట్లాడలేదా బాబూ..? ఇప్పుడు కేసీఆర్ హోదాకు అడ్డం అంటావా..? కేసీఆర్ నేను ప్రత్యేకహోదాకు వ్యతిరేకం కాదు అని తేల్చిచెప్పారు.. అసవసరం అయితే కేంద్రానికి కూడా రాఖ రాస్తా అని చెప్పలేదా..
6.ఓటుకు కోట్ల కేసులో పట్టుబడినప్పుడు నిన్ను కాపాడేందుకు ఈనాడు రామోజీ, ఆనాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, ఒక పెద్ద పదవిలో ఉన్న అధికారి చర్చలు జరపలేదా..?
7.మా 17 మంది ఎంపీలకు మీ 25 మంది ఎంపీల బలం కూడా ఉంటే బాగుంటుందని, ఫెడరల్ ఫ్రంట్‌లోకి రండి అని కేటీఆర్ జగన్ లు కలిస్తే మీ మీడియా రాష్ట్రం నాశనం అయిపోతుందంటూ దుష్ఫ్రప్రచారం చేస్తారా.. అయినా ఏపీలో టీఆర్‌ఎస్ పోటీ చేయదు.. వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుంది. కానీ కేసీఆర్‌తో ఒకసారి పొత్తుపెట్టుకుని, ఇంకోసారి ట్రై చేసిన నీవు కేసీఆర్‌ను తప్పుడు వ్యక్తిగా మీ కుల మీడియాతో డప్పు దుష్ప్రచారం చేయడం ఎంత పాపమో తెలియదా.?
8.అమరావతి ప్రారంభోత్సవానికి ఏ ఇతర రాష్ట్రాల సీఎంను పిలవకుండా కేసీఆర్‌ను మాత్రమే ఎందుకు పిలిచావు.?
9.అజ్ఞాతవాసి సినిమా బెనిఫిట్ షో కోసం కేసీఆర్‌ను కలిసిన తర్వాత కేసీఆర్‌ది అద్భుతపాలన అని పవన్ చెప్పలేదా..
10.వైయస్ లాగా కేసీఆర్‌ను కూడా వరుసగా రెండోసారి ప్రజలు ఎన్నికున్నారు.. అలాగే నువ్వు కూడా దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవగలవా..?