Home / 18+ / అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..

అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..

తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా గడ్డీ కరుస్తూ, అడ్డమైన ప్రొడక్టులకూ ప్రచారం చేసే ఈ రోజుల్లో ఆ యాడ్స్ జోలికి పోడు.ఇంతకు ఎవరో తెలుసా?అతడే అజిత్..పుట్టింది హైదరాబాదులోనే ఐన తండ్రి కేరళకు చెందిన బ్రాహ్మణుడు,తల్లి బెంగాల్‌కు చెందిన సింధీ.అజిత్ పెళ్లి చేసుకున్నది మాత్రం ఒకప్పటి మళయాళీ హీరోయిన్‌ షాలినిని

నిజానికి ఇవేవీ అసలు విశేషాలు కావు.అసలు చెప్పుకోదగిన విశేషం ఏమిటయ్యా అంటే..? తను తాజాగా ఓ లేఖ విడుదల చేశాడు.అయితే ప్రస్తుత రోజుల్లో మూఢభక్తితో ఊగిపోయే ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ తమ స్వార్థానికి వాడేసుకునే హీరోలే ఎక్కువుగా కనిపిస్తున్నారు… వాళ్లు పార్టీలు పెట్టాలన్నా, సినిమాలకు ప్రమోషనూ కావాలన్నా ఫ్యాన్సే… నమ్మిన ఫ్యాన్స్ నమ్మకాల్ని నట్టేట ముంచి హీరోలే ఉన్నారు…తోటి హీరోలపై ఉసిగొల్పుతూ జనాన్ని మరింతగా ఆ మూఢభక్తిలోనే ఉంచేయడం వాళ్ల అవసరం…ఇన్ని జరుగతున్న వేల అజిత్ రాసిన లేఖ ‘గంజాయి వనంలో తులసిమొక్క’లా సంస్కార పరిమళభరితంగా ఉంది…హీరోలను దేవుళ్లుగా ఆరాధించే సినిమా ఇండస్ట్రీలో… మరీ ప్రత్యేకించి సౌతిండియన్ ఇండస్ట్రీలో టాప్ హీరోలే కాదు, చిన్నా చితకా హీరోలకు చేతకాలేదు ఇలా అప్పీల్ చేయడం.

అజిత్ రాసిన లేఖ ఇది..

ఆన్ లైన్, సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపై క్రిటిక్కులను,ఇతర హీరోలను టార్గెట్ చేసే, కించపరిచే ఏ చర్యనైనా నేను అస్సలు సమర్థించను… నా పేరు, నా ఫోటో వాడుకుంటూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడితే ఒప్పుకోను, అలా జరిగితే వాటితో నాకు సంబంధం లేదు.ఆమధ్య ఓ ఫోటో బాగా వైరల్ అయ్యిందని అందరికి తెలిసిందే.ఓ సాదాసీదా వోటరుగా క్యూలో నిల్చున్నప్పటి ఫోటో అదే ఇది…ఫలానా పార్టీకి, ఫలానా నాయకుడికి వోటు వేయాలని నేను నా ఫ్యాన్స్‌కు చెప్పను, చెప్పలేదు, చెప్పవద్దు కూడాపద్ధతిగా వోటు వేసి రావడం తప్ప పాలిటిక్స్‌కు సంబంధించి ఇంకే అంశమూ నాకు తెలియదు.

ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ నేను పాలిటిక్స్‌లోకి రాను.నేను ఒక నటుడిని నటన నా వృత్తి.. అంతే తప్ప ఏ రాజకీయ లక్ష్యాలు నాకు లేవు,ఎవరితోను విభేదాలు కూడా లేవు.నా ఫ్యాన్స్ క్లబ్స్ అన్నింటినీ నేనే రద్దు చేసేసుకున్నాను.నిజంగా నా ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్లు విద్యార్థులయితే మంచిగా చదువుకుని వృద్ధిలోకి రండి, ఇతర రంగాల్లో ఉన్నవాళ్లయితే చట్టాల్ని గౌరవిస్తూ, నిజాయితీగా మీ పనులు మీరు చేసుకొండి.ఇతరులను గౌరవించండి, మీ ఆరోగ్యాల్ని చూసుకొండి.నన్ను నిజంగా ప్రేమించేవారి నుంచి నేను ఆశించేది ఇదే.అలాంటి వాళ్లే నా ఫ్యాన్స్ అని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat