నెల్లూరు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. స్వయానా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్క భర్త రామకోట సుబ్బారెడ్డి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి కుమారులు శశిథర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి, అనుచరులతో కలిసి కొద్దిసేపటిక్రితం జగన్‌మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సుబ్బారెడ్డి అనుచరులు పాల్గొన్నారు. ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ప్రతీ ఎన్నికల్లోనూ ఓడిపోతున్నారు. అయినా వైఎస్ జగన్ ని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. సోమిరెడ్డికి మంత్రి పదవి రావటానికి కూడా కారణం అదే. ఈ క్రమంలో సుబ్బా రెడ్డి చేరికతో ఇంటిమనుషులే టీడీపీని నమ్మడం లేదని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కడప తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీని క్లీన్ స్వీప్ చేయనుందని నెల్లూరు జిల్లా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.