లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోడీపై సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా 2019 లో మరోసారి మోడీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని అన్నారు . లోక్‌సభ చివరి రోజు సమావేశాల్లో మాట్లాడిన ములాయం.. మోడీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంతపోగా ప్రశంసకు మోడీ చిరునవ్వులు చిందించారు.
