బీసీలకు సీఎం చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పోడిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబేడ్కర్ ఐజయ్య విమర్శించారు. మొదటినుంచీ బీసీలకు అండగా ఉన్నది వైయస్‌ఆరేనని ఆయన అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీహామీని జగన్ నెరవేరుస్తారని తెలిపారు. వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇప్పుడూ చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తస్సకుండా న్యాయం జరుగుతుందన్నారు.
