వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఓటే తీసేసారు.. అవును చిత్తూరు జిల్లా పూతలపట్టు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఓటు తొలగింపునకు దరఖాస్తు రావడంతో ఆయన షాకయ్యారు. ఉద్దేశపూర్వకంగా వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి ఓటునే తొలగించేసారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఓటునే తొలగించేందుకు దరఖాస్తులు చేయడంపై విస్మయం కలిగిస్తోంది. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 లక్షల ఓట్లను తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఎదుటి పార్టీ ఓట్లను తొలగించి విజయావకాశాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు అర్ధమవుతోంది.
