తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా తనదైన శైలిలో పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నందుకు తలసానిని అభినందించారు. తలసాని కూడా దరువు, కరణ్ కాన్సెప్ట్స్ సేవలను అభినందించారు.
