తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏలూరు మేయర్ దంపతులు సైకిల్ పార్టీకి టాటా చెప్పేందుకు సిద్దమయ్యారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీ తీర్థం తీసుకోనున్నారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉదయం వైసీపీలో చేరనున్నారు. పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తామని, దీంతో పాటుగా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీతో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఏలూరు మేయర్ దంపతులు పార్టీని వీడనుండటం టీడీపీకి భారీ షాక్ అని పలువురు చర్చించుకుంటున్నారు.