మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. ఖూనీ కోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గుడు ఉమ అని, తన సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కొద్దిరోజుల వ్యవధిలో కూడా తనవారికి దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇసుక దోపిడీ చేసిన మంత్రి ఉమ, క్రైస్తవ ఆస్తులను దోచుకున్న మరోమంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటన్నారు.
2018 నాటికల్లా పోలవరం పూర్తి చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన దేవినేని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా వైసీపీ నేతలపై నోరు పారేసుకుంటే తగిన బుధ్ధి చెబుతామన్నారు. తమ పార్టీ అధినేత వేసవి సెలవులకు వెళితే పారిపోయారని వ్యాఖ్యలు చేయటం, వక్రభాష్యాలు పలకటం సిగ్గుచేటని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఓడిపోతామన్న భయంతోనే అధికారులు, వైసీపీపై లేనిపోని అభాండాలు మోపుతున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఏమాత్రం నైతిక విలువలు లేకుండా టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోసారు.