వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? అని ప్రశ్నించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చెప్పిన మాటలకి చేసిన పనులకి చాలా తేడా ఉందని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.అయితే సింగపూర్ డిజైన్లు అని చెప్పిన బాబు ఇప్పుడు కొద్దిపాటి వర్షం పడిన భవనాలు కూలిపోతున్నాయి.వీటికన్నా తాటాకు పందిళ్లు నయం అంటూ విజయసాయి రెడ్డి అన్నారు.
