ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైఎస్సార్సీపీ 143 సీట్ల ఆధిక్యం సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది.వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు.టీడీపీ కార్యాలయాలు అన్ని బోసిపోయాయి.తెలుగు తమ్ముళ్ళ ఒక్కసారిగా ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయారు.తూర్పుగోదావరి,పశ్చిమలో కూడా క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ ఉంది.ఈ దెబ్బతో చంద్రబాబు నివాశం కూడా నిర్మానుష్యంగా మారింది.అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియా కూడా మూగబోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది.