తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి పరాజయం పాలైన అనుముల రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు
