ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి చెందిన మంత్రులల్లో కొందరు వెనుకంజలో ఉన్నారు. వెనుకంజలో కొనసాగుతున్న వారిలో గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు,భూమా అఖిలప్రియ ఉన్నారు. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌ను బట్టి వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.వైసీపీ 143చోట్ల,టీడీపీ 21చోట్ల అధిక్యంలో ఉంది..
