దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో ఉన్నారు.ఆదినుండే వైసీపీ ఫ్యాన్ స్పీడ్ పెంచిందని తెలుస్తుంది.ఇక వార్ వన్ సైడ్ అవుతుందనే చెప్పుకోవాలి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం తాను పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా వెనకబడి ఉన్నారని తెలుస్తుంది.
