ఏపీలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే వస్తుంది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు అంతగా నమ్మినారు కాబట్టే వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.జగన్ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికి తెలిసిందే.చర్చలు ముగిసిన తరువాత జగన్ ఏపీ భవన్ కు వెళ్ళడం జరిగింది.అక్కకిడికి ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల ఛైర్మన్ కుమార మంగళం బిర్లా జగన్ ని కలిసారు.ఆయనతో పాటుగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా ఉన్నారు.
కుమార మంగళం దేశ పారిశ్రామిక దిగ్గజం అని చెబుతారు అలాంటి వ్యక్తి జగన్ ని కలిసారు అంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జగన్ ని అడిగారని తెలుస్తుంది.రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయం పై చర్చ జరిగిందని సమాచారం.ఈ విషయం పై కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో వెనకబడి ఉన్న జిల్లాలకు పెట్టుబడులు పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది.దీంతో అన్ని జిల్లాలు సమానంగా పోటీపడతాయని జగన్ అభిప్రాయపడ్డారని అంటున్నారు.ఇది పక్కన పెడితే అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబుని ఎవరు కలిసిన లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని బాబు అండ్ పచ్చ మీడియా హల్ చల్ చేసింది.అసలు నిజం ఏమిటంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవారు కాదు.చేసిన అప్పులు గుంజడానికి వచ్చారని అందరు అనుకుంటున్నారు.