మరికొద్ది నిమిషాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ వేడుకకు ఆతిధ్యమిస్తున్న ఇందిరాగాంధీ స్టేడియం ఉదయం నుండే కోలాహలంగా కనిపిస్తుంది.ఎటు చూసిన జై జగన్ జైజై జగన్ అనే మాట తప్ప వేరే మాట వినిపించడంలేదు.ఈ వేడుక ఒక పెద్ద పండుగల జరుగుతుందనే చెప్పాలి.ఇప్పటికే చాలావరకు పార్టీ నేతలు అందరు అక్కడికి చేరుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ముఖ్యనేతలు అందరికి ఆహ్వానం పలకడం జరిగింది.తెలంగాణ సీఎం కేసీఆర్,స్టాలిన్ ఇలా అందరికి పేరుపేరునా ఆహ్వానించారు.అంతేకాకుండా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని కూడా స్వయంగా జగన్ కాల్ చేసి మరి పిలవడం జరిగింది.ఇక సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఇలాంటి వేడుకలు రాని ఆయను కూడా జగన్ కోసం వచ్చారు.ఇలా ప్రతీఒక్కరు జగన్ పై ఉన్న అభిమానంతో తరలి వస్తున్నారు.ఇక సౌత్ ఇండియా మొత్తం ఒకే వేదికపై కనిపిస్తుందని చెప్పాలి.
