ఏపీ సీఎం వైఎస్ జగన్ లోటస్ పాండ్ సమీపంలో ఉన్న తన స్వగృహంలో నివాసం ఉండటాన్ని గతంలో రాష్ట్ర ద్రోహంగా ఆరోపణలు చేస్తూ గడచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాకుండా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆరోపణలు చేశారు. అయితే ఎవరికైనా కాలమే సమాధానం చెప్తుంది అనే నానుడి చంద్రబాబుకు ఇప్పుడు తగిలింది.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణంగా పరాజయం మూటగట్టుకున్న చంద్రబాబు వారంరోజులు తిరగకముందే తెలంగాణలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్ళిపోయారు..
5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ప్రతిపాదిత రాజధానిలో తన స్వగృహాన్ని నిర్మించుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు మాత్రం అక్రమ నిర్మాణమైన లింగమనేని గెస్ట్ హౌస్ లో కాపురం పెట్టారే తప్ప సొంత ఇల్లు కట్టుకోలేదు.. అలాగే ఓడిన వారంరోజుల్లోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గడ్డను వదిలిపెట్టి హైదరాబాద్ కు పారిపోవడం చూస్తుంటే రాష్ట్ర ద్రోహంగా మేము భావించాలా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ గారిపై టీడీపీ చేసిన కు-సంస్కార ఆరోపణలు మీకు కూడా వర్తిస్తాయి కదా అని అడుగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సమస్యలపై పోరాటంచేసి, దీక్షలు, ధర్నాలు చేసి లోటస్ పాండ్ ఇంట్లో నివాసం ఉన్న జగన్ పై విమర్శలు చేసిన మేధావులు ఓడిపోయిన చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన విధానంపై ఏం స్పందిస్తారో చూడాలి.