ఏపీ నూతన మంత్రి వర్గం నేడు కొలువ దీరనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం తీసుకుంటూ ఏకంగా ఐదురుగుర్ను ఉపముఖ్యమంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అంతే కాకుండా మొత్తం ఇరవై ఐదు మందితో క్యాబినెట్ విస్తరించనున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు మంత్రులుగా ఎన్నికైనవారికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్వయంగా కాల్ చేసి తెలిపారు.
ఈ క్రమంలో మొదటి నుండి మంత్రివర్గంలో తనకు చోటు లభిస్తోందని ఆశపడిన నగరి ఎమ్మెల్యే,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు ఆర్కే రోజాకు ఈ సారి నిరాశ ఎదురైంది. అయితే రాజకీయ సమీకరణాలు, సీనియార్టీని బట్టి ఈ సారి ఆర్కేరోజాతో పాటుగా మొదటి నుండి తనతో పాటు ఉన్న అంబటి రాంబాబు,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డి వంటి నమ్మకస్తులకు చోటు లభించలేదు. అయితే ఈ సారి విస్తరణలో తప్పనిసరిగా అవకాశముంటుందని జగన్ హామీ ఇవ్వడంతో వీరంతా కూల్ అయ్యారు అని సమాచారం.
అయితే ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నగరి ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాకు అసెంబ్లీ స్పీకర్ను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే తనలాంటి జూనియర్ కంటే అనుభవమున్న వారికి అవకాశమిస్తే మంచిదని.. తనకు మంత్రిగా ప్రజలకు సేవ చేయాలని.. అసెంబ్లీలో మీ మధ్య కూర్చోవాలని ఉందని రోజా చెప్పారు అని సమాచారం. అయితే తన మాట జవదాటని నేతగా. జగన్ కు ఎంతో ఇష్టమైన నాయకురాలిగా ఉన్న అర్కే రోజా ఈ నిర్ణయం తీసుకోవడం తో తనకు అందుబాటులో అది విజయవాడలో ఉండాలని జగన్ సూచించారని సమాచారం. ఇంకా రెండు గంటల దాక సమయం ఉండటంతో ఏమైన జరగొచ్చని రోజా అభిమానులు,వైసీపీ నేతలు అంటున్నారు.