ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి తనదైన మార్కును చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర నుండి ముఖ్య అధికారులతో,శాఖల సమీక్ష సమావేశాల్లో అనుసరించే విధానాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హట్ఠహాసంగా కాకుండా చాలా సింపుల్ గా నిర్వహించాలని సంబంధిత అధికారులను అప్పట్లోనే ఆదేశించాడు. అంతే కాకుండా తన కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బంది పడకూడదని కూడా కాన్వాయ్ ను వేరేమార్గంలో వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించాడు.
గత రెండు వారాలుగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో చేస్తోన్న ప్రతి పని ఒక సంచలనమవ్వడమే కాకుండా ఏకంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా సీఎంగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సచివాలయంలో తొలిసారిగా మొన్న అడుగు పెట్టిన సంగతి తెల్సిందే. సచివాలయంలోని తన ఛాంబర్లో కూర్చునే కుర్చి వెనక బ్యాక్ గ్రౌండ్ చూడటానికి చాలా రీచ్ గా ఎంతో ఆర్భాటంగా ఉన్న ఒక డిజైన్ ను చూసి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో తన చైర్ వెనుక ఉన్న డిజైన్ మార్చేసి చాలా సాధారణంగా ఉండాలని.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
దీంతో సంబంధిత అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోన్నారు. అయితే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఛాంబర్ తో పాటుగా కరకట్టలో ఉన్న అధికారక నివాసానికి సంబంధించి కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. జగన్ ముఖ్యమంత్రిగా తనదైన మార్కును చూపిస్తూ అందరీ మన్నలను పొందుతున్నారని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా నెటిజన్లు అయితే గతంలో ప్రజాధనాన్ని వృధా చేసే ముఖ్యమంత్రిని చూశాం . కానీ ఇప్పుడు ప్రజాధనాన్ని ఎలా ఆదా చేయాలో ఆలోచిస్తున్న ముఖ్యమంత్రిని జగన్లో చూస్తున్నాము. హ్యాట్సాఫ్ జగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు,ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు..