మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన అభిమానులతోపాటు ఇండస్ట్రీ మొత్తం వేయికళ్ళతో ఎదురుచూస్తుంది.. అయితే ఈ సినిమాపై ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడారు. అభిమానుల అంచనాలను మించి సినిమా ఉంటుందంటున్నారు.. చిరంజీవి నటించిన సైరా సినిమా ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుంది.. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచుతుంది.. అంటూ సినిమాపై అంచాలు భారీగా పెంచేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తిరుమలలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. సినిమా ఆలస్యమైందని అభిమానులు బాధపడొద్దని, కష్టపడినదానికి ఫలితం దక్కుతుందన్నది ఖచ్చితంగా సినిమాలో కనిపిస్తుందన్నారు.. సైరాలో కొత్త క్యారెక్టర్ తనకు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను ప్రేక్షకులు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు. ఆయన దర్సకుడిగా ఆగష్టులో ప్రారంభించనున్న సినిమా షూటింగ్ బాగా జరగాలని, సక్సెస్ కావాలని శ్రీవారిని ప్రార్థించడానికి తిరుమల వచ్చానని భరణి చెప్పారు.