ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర మహిలా కమీషన్ ఛైర్ పర్షన్ గా వైసీపీ అధికార ప్రతినిధి అయిన వాసిరెడ్డి పద్మను నియమించనున్నారని సమాచారం. దీనిగురించి త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే అంతకుముందు రోజాకు మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ పదవినీ నగరి ఎమ్మెల్యే ,వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఇస్తారని ప్రచారం జరిగింది.కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు ఏపీఐఐసీ పదవీ కట్టబెట్టారు.
