నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ అభియోగాలను ఎదుర్కోవాల్సిందే. అందులో ఎలాంటి శషభిషలూ లేవని స్పష్టం ఆయన చేశారు.అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈ నలుగురిలో ఇద్దరు ఈడీ అభియోగాలను ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు శనివారం ఏపీలో గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలోజీవీఎల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆలోచన ధోరణితో పాటు కేవలం రాజకీయం కోసం కాకుండా ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడి కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపారు కాబట్టే ప్రజలు తిరిగి అఖండ మెజారిటీని కట్టబెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
