నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అలరించిన విజయ నిర్మల భౌతికంగా మనకి దూరమయ్యారు. కొద్ది సేపటి క్రితం చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు.ఆమెను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఫాంహౌస్‌కి భారీగా తరలి వచ్చారు. ఆవిడ ఏ లోకంలో ఉన్న కూడా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.ఎప్పుడు తన వెంట ఉండే విజయ నిర్మల ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళారు అనే విషయాన్ని కృష్ణ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోన్యమైన జంటగా పలువురికి ఆదర్శంగా నిలిచారు కృష్ణ, విజయ నిర్మల. ఆమె మనకి భౌతికంగా దూరమైన తన సినిమాల ద్వారా ఎప్పటికి అలరిస్తూనే ఉంటారు.సినీ ,రాజకీయ ప్రముఖులు ఆమె కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని అందించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.
