సీఎం జగన్ మాట్లాడేది చేస్తున్నారు.. చేసే ముందే చెప్తున్నారు. ఉదాహరణకు నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి అయిన జగన్ 108 వాహనాలు త్వరితగతిన రోడ్లపైకి రావాలని ఆదేశించారు. అయితే అందరూ ఈ తతంగం పూర్తవడానికి కనీసం ఏడాదిన్నర పడుతుందని అనుకున్నారు. అయితే జగన్ కేవలం ఆదేశాలిచ్చి మాట ఇచ్చి వదిలేయలేదు.. వాస్తవానికి 108 వాహనాల నిర్వహణకు జీవీకేఈఎంఆర్‌ఐ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్ కాలపరిమితి ఇటీవల ముగిసింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు పిలుస్తున్నారు.
వాటికి నిబంధనలు రూపొందించి, టెండర్ ఖరారు చేసేందుకు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీ నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీచేసింది. కమిషనర్ చైర్ పర్సన్‌గా ఉండే ఈకమిటీలో పబ్లిక్ హెల్త్ విభాగం డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, టీఎస్‌ఎంఐడీసీ చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర హెల్త్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్, రవాణాశాఖ జాయింట్ సెక్రెటరీ సభ్యులున్నారు. మరో 3నెలల్లోపే కాంట్రాక్ట్ ప్రక్రియ ముగించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించే వరకూ జీవీకే కొనసాగనుంది. తాజా వేగంగా ఇస్తున్న జీఓలు, ప్రజారోగ్యం పట్ల జగన్ కనబరుస్తున్న శ్రద్ధపై ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ చాలా స్పీడుగా ఉన్నారబ్బ అంటూ యువ సీఎంను ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నారు.