చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ మరియు డబ్బింగ్ పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా అనంతరం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో వేరే సినిమా తీయనున్నాడు.అంతేకాకుండా దీనిపై ఇప్పటికే వార్తల్లో హలచల్ చేస్తుంది.అయితే మొన్ననే షూటింగ్ పూర్తి చేసుకున్న చిరు రెస్ట్ తీసుకుంటాడని అభిమానులు అనుకుంటున్నారు.అయితే అభిమానులకు షాక్ తగిలేలా సంచలన నిర్ణయం తీసుకున్నాడు చిరు.ఈ జూలై నెల రెండో వారంలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆయన కొరటాలకు చెప్పారట.ఈ చిత్రాన్నికి కూడా రామ్ చరణ్ నే నిర్మించనున్నాడు.దీంతో జూలై రెండో వారంలోనే హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అవనుందని తెలుస్తుంది.
