బంగ్లాదేశ్ తో ఈ రోజు మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. తొలి పది ఓవర్ల తొలి పవర్ ప్లేలో టీమ్ ఇండియా ఓపెనర్లు పది ఓవర్లలో మొత్తం అరవై తొమ్మిది పరుగులను సాధించింది. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్ లో మూడు సార్లు వందపరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత్ 2007లో ఆస్ట్రేలియా తర్వాత ఈ ఘనతను సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇప్పటివరకు మొత్తం 31ఓవర్లు ముగిసేవరకు ఒక వికెటును కోల్పోయి 184పరుగులను సాధించింది. క్రీజులో కేఏల్ రాహుల్ 90బంతుల్లో 76,కోహ్లీ 5బంతుల్లో ఒక్క పరుగుతో ఆడుతున్నారు. రోహిత్ శర్మ 92బంతుల్లో 102పరుగులను సాధించి క్యాచ్ ఔట్ అయ్యాడు.
