ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రోజురోజుకి తెలుగుదేశం పార్టీ దీన స్థితిలోకి వెళ్ళిపోతుందని అర్ధమవుతుంది.సొంత పార్టీ నాయకులే చంద్రబాబుకు చుక్కులు చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు గమ్మున కుర్చుని దోచుకున్న కాడికి దోచేసి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవ్వరూ లెక్కచేయడంలేదు. ఇంత జరిగినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు రాజభోగాలు అనుభవించిన బాబు ప్రతిపక్ష నేతగా కూడా అలానే ఉండాలని అనుకుంటున్నాడు.
అయితే ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు.”ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ అని బుద్ధి చెప్పారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.ఆ సమయంలో ఆయన ప్రజా సమస్యలు కోసం పోరాడారు తప్ప మీలా సొంత ప్రయోజనాల కోసం ఎన్నడూ పోరాడలేదు అని అన్నారు.అందుకే ప్రజలు జగన్ ను నమ్మి అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను గాలికొదిలి తన సౌకర్యాల గురించి పోరాడుతున్నారు చంద్రబాబు. ప్రభుత్వానికి రాసిన మొదటి లేఖలో ప్రజావేదికను కేటాయించాలని కోరారు. తనకు భద్రత పెంచాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. వేతనం తీసకుంటున్నందుకైనా ప్రజలను కాస్త గుర్తు పెట్టుకోండి బాబూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 3, 2019