టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎన్నికలకు రెండు నెలల ముందు బాబు చేసిన అక్రమాలను,అన్యాయాలను బయట పెట్టాడు.పసుపు-కుంకుమ, పింఛన్ల పేరుతో ఓటర్లను ఆకర్షించి ఎలాగైన గెలవాలని వేల కోట్లు వృధా చేసాడు.విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ అంటూ ట్విట్టర్ లో స్పందించాడు.
ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి ఆ తరువాత రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఇంత డబ్బు ఎక్కడ నుండి తెచ్చాడు,మొదటిలో ఇవ్వని ఈ స్కీమ్స్ లు ఇప్పుడు ఎందుకు ఇచ్చాడో అందరికి తెలుసని అన్నారు.ఏపీ ప్రజల్ని అమాయకుల్ని చేసి డబ్బులు ఎరవేసి గెలవాలి అనుకున్న బాబుకి ప్రజలు సరైన బుద్ధి చెప్పడమే కాకుండా భారీ మెజారిటీతో జగన్ ను గెలిపించారు.ఇన్ని తప్పులు చేసి నువ్వు నిజాయితీ కోసం మాట్లాడుతుంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ అని ట్వీట్ చేసారు.
విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో బురిడీ కొట్టించడానికి 30 వేల కోట్లు మాయ పేలాలు చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 3, 2019