ఇటీవల జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ ఓటమిని చవి చూసిన సంగతి తెల్సిందే. ఆయనపై ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. దాదాపు5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్… గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేశ్‌కు ఓటమి తప్పలేదు. అయితే తన ఓటమి గురించి నారాలోకేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ,తనకు మధ్య దూరం ఉండటం వలనే ఓడిపోయాను అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక నుండి తను ప్రజల్లో ఉంటూ.. అందరి సమస్యలకై పోరాడుతూ నియోజకవర్గంలో అందరికి అండగా ఉంటానని లోకేశ్ తెలిపారు.
