Home / 18+ / రంగాను చంపిన చంద్రబాబు.. చంద్రబాబును బండబూతులు తిట్టి టీడీపీలో చేరిన కొడుకు రాధా

రంగాను చంపిన చంద్రబాబు.. చంద్రబాబును బండబూతులు తిట్టి టీడీపీలో చేరిన కొడుకు రాధా

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య ఓ సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండగా మారింది. దాదాపు 40రోజులు బెజవాడ అట్టుడికిపోయింది.. 1988 డిసెంబర్ 26వ తేదీన రంగా హత్యకు గురయ్యారు. అయ్యప్ప మాలవేసుకుని వచ్చిన దుండగులు నిరాహారదీక్షలో ఉన్న రంగాను అత్యంత కిరాతకంగా నరికి హత్య చేశారు. 1985 ఎన్నికల్లో జైలులో ఉండే రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. హత్య జరిగిన వెంటనే బాధ్యత వహిస్తూ హోంమంత్రి కోడెల శివప్రసాదరావు తన పదవికి రాజీనామా చేశారు. కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో రంగా హత్య జరిగింది. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లలో పెద్దయెత్తున ప్రాణనష్టం జరిగింది. అప్పట్లోనే కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు ధ్వంసమయ్యాయి.

ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. ఎన్టీ రామారావు సోదరుడికి చెందిన సినిమాలను ధ్వంసం చేశారు.. ఒక వర్గంవారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇది వంగవీటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న వైరం.. అలాగే సాక్ష్యాత్తూ చంద్రబాబే ఈ హత్య చేయించారని ప్రధాన పత్రికల్లోనూ వార్తలొచ్చాయి. కానీ ఆయన తనయుడు రాధా టీడీపీలో చేరారు. మీ నాన్నగారిని చంపిన పార్టీకి ఎలావెళతారని మీడియా వేసిన ప్రశ్నలకు రాధా చెప్పిన సమాధానం కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళతారని మీడియా అడిగిన ప్రశ్నకు అది కొంతమంది వ్యక్తులు చేసింది పార్టీకి సంబంధం లేదని మరీ రాధా సెలవిచ్చారు. మరి ఇంతకాలం నువ్వే కదా తెలుగుదేశం పార్టీ నా తండ్రిని పొట్టన పెట్టుకుందన్నావని అందరూ రాధాని విమర్శించారు.

అయితే రంగా హత్యకేసులో చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద రావులే ప్రధాన దోషులని వైసీపీ మొదటినుంచి విమర్శించింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసంది. అలాగే రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర  ఉందని మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా రాధా రాజకీయ వ్యవహారశైలి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపధ్యంలోనే రాధాకు విజయవావాసులు ఐదు ప్రశ్నలు వేసారు

1. రంగాగారిని చంపిన పార్టీలో మీరు ఎలా చేర‌తారు.? రంగాను చంపించింది టీడీపీనే అని మీరే బ‌హిరంగంగా  చెప్పారు. మ‌రి అలాంటి పార్టీలో మీరెలా చేర‌తారు.

2. గతంలో చెడ్డ‌వాడు అయిన చంద్ర‌బాబు ఇప్పుడు ఎలా మంచివాడు అయ్యాడో మీరే చెప్పాలి. గతంలో చంద్ర‌బాబును బూతులు తిట్టిన నోటితోనే మీరు ఎలా చంద్ర‌బాబును పొగుడుతున్నారు.

3. వంగ‌వీటి రంగాని చంపినవారు టీడీపీలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. వారితో క‌లిసి ఎలా కూర్చుంటారు.

4. మీ నాన్న‌గారు పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో సేవ చేశారు. కాని మీరు మాత్రం పేద ప్ర‌జ‌ల‌కు అది చేస్తా.. ఇది చేస్తా అని మాయమాట‌లు చెప్పి ఎందుకు మోస‌గించారు.

5. నిన్ను న‌మ్ముకున్న నీ వ‌ర్గాన్ని ఏనాడు ప‌ట్టించుకోని చిన్న రాజ‌కీయ జీవితంలో నాలుగు పార్టీలు మారిన మిమ్మ‌ల్ని మేమెలా న‌మ్మాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat