Home / NATIONAL / 2019-20కేంద్ర బడ్జెట్-ధరలు తగ్గేవి.పెరిగేవి ఇవే..!

2019-20కేంద్ర బడ్జెట్-ధరలు తగ్గేవి.పెరిగేవి ఇవే..!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంటులో 2019-20కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా.. మరికొన్ని వర్గాలకు నష్టం చేకూర్చేలా ఉందని ప్రతిపక్షాలు,విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏమిటో తెలుసుకుందామా..?
పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు పెరగనున్నాయి.

ధరలు పెరిగేవిఃసీసీ టీవీ, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్స్‌, మెటల్‌ ఫిట్టింగ్‌, ఫర్నిచర్‌, సింథటిక్ రబ్బర్‌, మార్బుల్ ల్యాప్స్‌, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, ఐపీ కెమెరా, డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌, స్ల్పిట్‌ ఏసీలు, లౌడ్‌ స్పీకర్స్‌, సిగరెట్లు, ఫ్లగ్స్‌, సాకెట్స్‌, స్విచ్‌లు, గుట్కాల ధరలు పెరనున్నాయి.

ధరలు తగ్గేవిః ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటి రుణాలు, తోలు ఉత్పత్తులు, కృత్రిమ కిడ్నీల ముడిసరుకు, దిగుమతి చేసుకున్న ఊల్‌ ఫైబర్‌, రక్షణ పరికరాలు ధరలు తగ్గనున్నాయి.