నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
