తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ రోజు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోదాడలో పలు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ మున్సిపల్ మాజీ చైర్మన్ అనిత నాగరాజ్, ఎంపీటీసీలు జెడ్పిటీసీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు
