లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ మండిపడ్డారు. మొన్నటివరకూ సతీష్ తమతోనే ఉన్న సతీష్ తాజాగా చేసిన ఈ కామెంట్లతో చంద్రబాబు పెద్దషాకే తగిలినట్లైంది. పార్టీలో ఉన్నంతవరకూ సతీష్ చంద్రబాబుకు వీర విధేయునిగా ఉండేవాడు. అలాంటిది రాజీనామా చేసిన వెంటనే ఇద్దరికీ దిమ్మతిరిగేలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తనతోపాటు చాలామంది టీడీపీకి రాజీనామాలు చేయబోతున్నట్లు సతీష్ ఓ భారీ బాంబు పేల్చారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సతీష్ ఎమ్మెల్సీ తీసుకున్నారు.
తాను ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన అంశం తెరపైకి వచ్చిన వెంటనే అందరిచూపు ఇపుడు లోకేష్ పై పడింది. ఎంఎల్ఏగా ఓడిపోయిన లోకేష్ ఎంఎల్సీ గా ఎలా కంటిన్యూ అవుతారంటూ సతీష్ ప్రశ్నించటం మరో మలుపు.. ఈ విషయంలోనే లోకేష్ రాజీనామా అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. అసలు గత సార్వత్రిక ఎన్నికలకు ముందే సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి తమతమ ఎంఎల్సీ పదవులకు రాజీనామా చేసారు. ఎన్నికలకు వెళ్లారు. కానీ లోకేష్ మంగళగిరి లో పోటీచేసి ఓడిపోయారు. కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేయాలని సతీష్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకూ లోకేశ్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి భరించిన వీరంతా ఇప్పుడు కూడా లోకేశ్ పార్టీ పరంగా మాట్లాడుతుండడం పట్ల ఏమాత్రం సహించడం లేదని అర్ధమవుతోంది.