ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ..రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పట్ల ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.ఈ అక్టోబర్ నెల నుండి రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 64లక్షల మంది ఈ పథకానికి అర్హత పొందుతారని అన్నారు. ఈ మేరకు ఏపీ బడ్జెట్ లో రూ.8,750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి నమ్మించి రైతులకు అన్యాయం చేసారని, మొత్తం 87వేల కోట్లు రుణాలు ఉంటే రైతులను మభ్యపెట్టి కేవలం 24వేల కోట్లకు మాత్రమే కుదించారని అన్నారు. అప్పటి ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా ఉపయోగించలేకపోయింది. అలాంటి టీడీపీ పార్టీ ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తుంటే తట్టుకోలేక వివాదాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. వాళ్లకి చేతకాదు కాని ఇప్పుడు చేసేవాళ్ళని అడ్డుకుంటారా అని ప్రశ్నించాడు.
